సెంచరీ మిస్ అవడంపై నాకు అసంతృప్తి లేదు-వాషింగ్టన్ సుందర్
భారత్, ఇంగ్లాండ్ మధ్య చివరి టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగు టెస్టుల మొదటి టెస్టులో ఓటమి పాలైన భారత్ వరుసగా మూడు విజయాలు నమోదు చేసి ఇంగ్లాండ్ కు ఝలక్ ఇచ్చింది. చివరి రోజు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లాండ్ పై 160 పరుగుల ఆధిక్యం సంపాదించడంలో కీలక పాత్ర పోషించాడు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్. విరోచిత ఇన్నింగ్స్ ఆడి 96 పరుగులతో నాటౌట్ గా నిలిచిన సుందర్ దురదృష్టవశాత్తు సెంచరీని మిస్సయ్యాడు.
టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత వాషింగ్టన్ సుందర్ మీడియాతో కాసేపు మాట్లాడాడు.
సొంతగడ్డపై నేను ఆడిన మొదటి టెస్ట్ సిరీస్ ను గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా గొప్ప అనుభూతి. సెంచరీ మిస్ అవడం పై నాకు అసంతృప్తి లేదు. సమయం వచ్చినప్పుడు సెంచరీ కచ్చితంగా సాదిస్తాను. జట్టు విజయానికి దోహదపడటం చాలా సంతోషంగా ఉంది. నిజాయితీగా చెప్పాలంటే పిచ్ బ్యాటింగ్ కు చాలా అనుకూలంగా ఉంది. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లు జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్ లను కచ్చితంగా అభినందించాలి. ఎందుకంటే, ఈ పిచ్ పై వారి ప్రదర్శన అద్భుతం. వికెట్ బౌలింగ్ కు కూడా ఎంతగానో అనుకూలిస్తుంది. కానీ, ఓపికగా ప్రయత్నిస్తే పరుగులు సాధించడం ఏమంత కష్టం కాదు." అని అన్నాడు.
అనూహ్యంగా చివరి నిమిషం లో జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ తన బ్యాటింగ్ ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ పరుగులు సాధిస్తూ జట్టుకు తనవంతు సాయం చేస్తూనే ఉన్నాడు. ఈరోజు సుందర్ సెంచరీ పూర్తి చేసే వాడే కానీ దురదృష్టం సుందర్ పక్షాన నిలిచింది. కానీ, అతని ఇన్నింగ్స్ సెంచరీ కంటే విలువైనది అనడంలో సందేహం లేదు.
No comments