ఐపీఎల్-2021 ఫుల్ షెడ్యూల్ ఇదే!

భారత్, ఇంగ్లాండ్ మధ్య నెల రోజుల పాటు సాగిన నాలుగు టెస్టుల సిరీస్ ముగిసింది.  మరో నెల రోజుల పాటు ఇరుజట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరగనుంది.   షెడ్యూలు ప్రకారం భారత్ ఇంగ్లాండ్ మధ్య పరిమిత ఓవర్ల ముగిసిన వెంటనే ఐపీఎల్ ప్రారంభం కానుంది.ఈ మేరకు ఈరోజు ఐపీఎల్ పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించింది.

ఈ సమావేశంలో ఐపీఎల్ ప్రారంభ తేదీ ఏప్రిల్ 9 గా నిర్ణయించింది. దాదాపు రెండు నెలల పాటు సుదీర్ఘంగా సాగే ఈ మెగా టోర్నమెంట్...మే 30 వరకు కొనసాగుతుంది.  మే 30న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఐపీఎల్ ఫైనల్ జరగనున్నట్లు ఐపీఎల్ పాలకమండలి సభ్యులు తెలిపారు. మొత్తంగా 52 రోజుల పాటు 60 మ్యాచ్ లు జరగనున్నాయి.

గత ఏడాది నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఐపీఎల్ 13వ సీజన్ యూఏఈలో జరిగిన సంగతి తెలిసిందే. 2021లో జరగబోయే 14వ సీజన్ మాత్రం భారత్లోనే జరగనున్నట్లు ఐపీఎల్లో పాలకమండలి ఇదివరకే ప్రకటించింది.  మొదట కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒకే  వేదికపై ఈ టోర్నమెంట్ మొత్తాన్ని నిర్వహించాలనుకున్న ఐపీఎల్ నిర్వాహకులు తర్వాత మనసు మార్చుకున్నారు.  రోజురోజుకు పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని 4 లేదా 5 వేదికలలో ఈ టోర్నమెంట్ ను నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్  టోర్నమెంట్ ను నిర్వహించే విధంగా ప్రణాళిక రచిస్తున్నారు.

నాకౌట్ మ్యాచ్ లు మాత్రం ఆహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్నట్లు ఐపీఎల్ పాలక మండలి తెలిపింది.

No comments

Powered by Blogger.