మొదటి T20 కి ముందు టీమిండియాకు కొత్త తలనొప్పి

 భారత్, ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ కోసం జట్టు ఎంపిక విషయమై  బిసిసిఐ సెలెక్టర్లు  తీవ్ర కసరత్తులు చేస్తున్నారు.  భారత బెంచ్ పటిష్టంగా ఉండటంతో జట్టు ఎంపిక  సెలెక్టర్లకు, కెప్టెన్ కోహ్లీ కి, కోచ్ రవి శాస్త్రి కి తలనొప్పిగా మారింది.  ఎందుకంటే... జట్టులో ఒక స్థానం కోసం కనీసం ఇద్దరేసి ఆటగాళ్లు పోటీపడుతున్నారు.

ఓపెనర్ స్తానం కోసం కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.  ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ తోపాటు ఆస్ట్రేలియా పర్యటనలో కూడా సత్తా చాటిన  యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్... కెఎల్ రాహుల్ కు గట్టి పోటీనిస్తున్నాడు. ఈ ఇద్దరికీ పోటీగా ఇషాన్ కిషన్ కూడా జట్టు లో ఉన్నాడు.

ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా  స్థానానికి డోకా లేనప్పటికీ ఇంగ్లాండ్ పై మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్  లలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై సందిగ్థత నెలకొంది. వీరికి తోడుగా స్పిన్నర్ల విభాగం లో...చాహల్ కూడా తుది జట్టు లో  స్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.

ఇటీవల ఐపీఎల్ లో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్ రాకతో  నాలుగో స్థానంలో ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ స్థానానికి ప్రమాదం ఏర్పడింది.ఇక ఫాస్ట్ బౌలర్ల విభాగంలో తుది జట్టులో చోటు కోసం తీవ్ర పోటీ నెలకొంది.  భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, నటరాజన్, నవదీప్ సైనీలు తుది జట్టులో చోటు కోసం పోటీపడుతున్నారు.

భారత రిజర్వ్ బెంచ్  పటిష్టంగా ఉండటం జట్టుకు అనుకూలించే విషయమే అయినప్పటికీ... ఆటగాళ్లకు తుది జట్టులో చోటు కల్పించడం.... అటు బీసీసీఐ...ఇటు కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవి శాస్త్రి లకు కత్తిమీదసాము అనే చెప్పాలి. దీంతో, తుది జట్టు లో ఎవరెవరికి స్థానం దక్కుతుంది అనే విషయమై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

No comments

Powered by Blogger.