ఆ యువ ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కడం అనుమానమే:లక్ష్మణ్

 భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్  ఈ శుక్రవారం అహ్మదాబాద్ స్టేడియంలో ప్రారంభం కానుంది.  తుది జట్టులోకి ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై సెలక్టర్లు  మల్లగుల్లాలు పడుతున్నారు.

ఐపీఎల్లో అద్భుతంగా రాణించి భారత జట్టులో చోటు సంపాదించిన యువ ఆటగాళ్లు ఆరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, భారత మాజీ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్ వారి ఆశలపై నీళ్లు చల్లాడు.

లక్ష్మణ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే...

"  సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రాహుల్ తెవాతియ..ఈ ముగ్గురు నాణ్యమైన ఆటగాళ్లే.  వారి చేరిక జట్టులో బలాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు.  కానీ, ఈ ముగ్గురికీ ఈ టి 20 సిరీస్ లో తుది చోటు దక్కే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి.  ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జట్టు అత్యంత పటిష్టంగా ఉంది. ఈ జట్టులో  మార్పులు చేర్పులు చేస్తే జట్టులో లయ దెబ్బతింటుంది.  కాబట్టి ఇదే జట్టును కొనసాగించడం మంచిది.

నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ కు మించి మంచి ప్రత్యామ్నాయం లేనే లేదు. ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లను వణికించిన రిషబ్ పంత్  ఐదో స్థానంలో బరిలోకి దిగాలి.  అతడి తర్వాత ఫినిషింగ్ పాత్రలో హార్దిక్ పాండ్యా వస్తే బాగుంటుంది.

 బ్యాటింగ్ ఆర్డర్ ఇంత పటిష్టంగా ఉన్నప్పుడు సూర్య కుమార్ యాదవ్, రాహుల్ తెవాతియా, ఇషాన్ కిషన్ లకు  చోటెక్కడ ఉంటుంది." అని అన్నాడు.

No comments

Powered by Blogger.