రోహిత్ ఆటను చూసి నేర్చుకో కోహ్లీ-మనోజ్ తివారిభారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు.  నాలుగు టెస్టుల్లో కోహ్లీ కేవలం రెండు అర్థ సెంచరీలు మాత్రమే చేసాడు. సిరీస్ మొత్తంగా కోహ్లీ చేసింది కేవలం 172 పరుగులు చేయగా...రోహిత్ శర్మ దాదాపు 350 పరుగులు చేసాడు.  కోహ్లీ విఫలమవడానికి... రోహిత్ విజయవంతం కావడానికి గల కారణాలను విశ్లేషించాడు భారత వెటరన్ క్రికెటర్ మనోజ్ తివారీ.

మనోజ్ తివారీ మాట్లాడుతూ ఏమన్నాడంటే...

ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్లో కోహ్లీ ఎక్కువగా ఆఫ్ స్టంప్ అవతల పడిన  బంతులను వెంటాడే అవుటయ్యాడు.  అలాంటి బంతులను ఆడగలనన్న నమ్మకం ఉన్నప్పుడే ఆడాలి.  లేదంటే ఆ బంతులను విడిచిపెట్టాలి.  రోహిత్ శర్మ అలాంటి బంతులను చాలా చాకచక్యంగా వదిలిపెట్టాడు.  అందుకే రోహిత్ ఈ సిరీస్లో  పరుగులు సాధించాడు. ఒక బంతిని వదిలి పెట్టడం కూడా టెస్ట్ క్రికెటర్ నైపుణ్యమే.  ఆ విషయాన్ని  రోహిత్ ని చూసి కోహ్లీ నేర్చుకోవాలి.  ప్రపంచంలో అత్యుత్తమ క్రికెటర్ అయినా కోహ్లీ నేర్చుకోవడానికి ఏముంటుంది అని అనుకోవడానికి వీల్లేదు.  అటువంటి బంతులను విడిచి పెట్టలేక కోహ్లీ ఈ సిరీస్లో రెండుసార్లు డకౌట్ అయ్యాడు.  ఇకనైనా కోహ్లీ ఆ పొరపాటు చేయకుండా ఉంటే బాగుంటుంది. " అని అన్నాడు.

మొత్తంగా కోహ్లీ ఆటగాడిగా విఫలమైనా కెప్టెన్గా మాత్రం అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.  అంతేకాదు అత్యధిక విజయాల్లో భారత జట్టును నడిపించిన విజయవంతమైన కెప్టెన్గా కూడా కోహ్లీ రికార్డు సృష్టించాడు.


No comments

Powered by Blogger.