రోహిత్ శర్మతో ఓపెనింగ్ జోడిగా వచ్చేది అతడే

 భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్  ఈ శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది.  భారత తుది జట్టు ఎంపిక ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చింది.  అయితే జట్టు ఎంపిక సమయంలో రోహిత్ శర్మకి ఓపెనింగ్ జోడి గా ఎవరైతే బాగుంటుంది అనే చర్చ  మాత్రం జోరుగా సాగుతోంది.

ముందుగా రోహిత్ శర్మకు జోడిగా కె.ఎల్.రాహుల్ ని అనుకున్నప్పటికీ...ఇద్దరూ కుడిచేతి వాటం బ్యాట్స్మన్ కాంబినేషన్ కావడంతో పాటు... ప్రపంచ కప్ కోసం ఆటగాళ్లను సిద్ధం చేయాలి అనే ఉద్దేశ్యంతో..కె ఎల్ రాహుల్ ఓపెనింగ్ విషయం లో సెలక్టర్లు వెనక్కు తగ్గారు.

సుదీర్ఘంగా చర్చించిన తర్వాత శిఖర్ ధావన్ ను రోహిత్ శర్మ కు జోడిగా ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. కుడి, ఎడమల కాంబినేషన్ ని దృష్టిలో ఉంచుకుని శిఖర్ ధావన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ధావన్ కూడా గత కొంత కాలంగా క్రికెట్ ఆడటం లేదు. ప్రపంచ కప్ కోసం అతని సామర్థ్యం తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో...బీసీసీఐ ధావన్ వైపు మొగ్గు చూపింది.

అంతేకాకుండా, రాహుల్ ఓపెనర్ గా కాకుండా... మిడిలార్డర్లో వస్తే జట్టులో సమతుల్యం ఉంటుందనేది సెలెక్టర్ల భావన.  

ఈ కారణం చేతనే టీ20 సిరీస్ లో రోహిత్ కి  జతగా శిఖర్ ధావన్ బరిలోకి దిగే అవకాశాలు మెరుగయ్యాయి.  శిఖర్ ధావన్ ఇటీవల ముగిసిన ఐపీఎల్లో  618 పరుగులు సాధించిన విషయం తెలిసిందే.  టోర్నమెంట్ మొత్తంగా రెండు సెంచరీలు నాలుగు అర్ధ సెంచరీలు సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్స్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 

No comments

Powered by Blogger.