ఇకనుండి టీంఇండియాకు రెండు జట్లు ఉంటాయి-రవి శాస్త్రి

 ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నప్పటికీ...పరిస్థితులు పూర్తిగా చక్కబడలేదు.  ఆటగాళ్లు ఇప్పటికీ బయో సెక్యూర్ బబుల్ లోనే ఉంటున్నారు.  ఏడురోజుల క్వారంటైన్ నిబంధనలను పాటిస్తూనే ఉన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ క్రికెట్ జట్లన్నిటిలో బాగా లాభపడిన జట్టు ఏదైనా ఉందంటే అది ఒక్క భారత జట్టే అని చెప్పాలి.ఈ విషయాన్ని స్వయంగా భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అదే సమయం లో టీం ఇండియా భవిష్యత్తు గురించి కీలక విషయాలు వెల్లడించాడు.

రవి శాస్త్రి మాట్లాడుతూ ఏమన్నాడంటే...

 లాక్ డౌన్ పూర్తయిన తర్వాత క్రికెట్లో నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. బయో బబుల్ కారణంగా ఆటగాళ్ళ భద్రత విషయం అటుంచితే... మానసికంగా అది పెద్ద తలనొప్పే.  ఏది ఏమైనా భారత జట్టు మాత్రం  ఈ నియమ నిబంధనల కారణంగా దాదాపు 30 మంది క్రికెటర్లను స్క్వాడ్ లో ఉంచి ఆడించింది.  ఇందులో మరో గొప్ప విషయం ఏమిటంటే అందరు ఆటగాళ్లు తమ పూర్తి స్థాయిలో సత్తా చాటారు.  ఏ ఒక్కరిని తక్కువ చేయడానికి లేదు.

ఇప్పుడు భారత జట్టు పరిస్థితి ఎలా ఉందంటే  ఒకేసారి రెండు టోర్నమెంట్లలో రెండు జట్లతో పోటీ పడేలా ఉంది. భారత రిజర్వ్ బెంచ్ అత్యంత పటిష్టంగా ఉంది.  బెంచ్ లో ఉన్న ఆటగాళ్లను జట్టుగా చేసినా పటిష్టమైన భారత జట్టుగా తయారవుతుంది. అందుకే భారత జట్టు ని ఇండియా ఏ, ఇండియా B జట్లుగా విడగొట్టడానికి బీసీసీఐ కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇలా చేయడం వల్ల సీనియర్ ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి...జూనియర్ ఆటగాళ్లకు అవకాశాలు దక్కుతాయి. యువ ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే చాలా గర్వంగా ఉంది. బయో సెక్యూర్ బబుల్ మాకు మాత్రం చాలా మేలు చేసింది " అని పేర్కొన్నాడు.

త్వరలో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్, ఆసియా కప్ ఒకేసారి జరగనుండటంతో   భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఒక వినూత్న ఆలోచనకు తెరలేపింది.   భారత జట్టు రెండు జట్లుగా విడిపోయి అటు ఛాంపియన్షిప్ ఫైనల్ ఇటు ఆసియా కప్ ను అందించాలనే యోచనలో ఉంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ జట్టు కు కోహ్లీ, ఆసియా కప్ జట్టు కు రోహిత్ నాయకత్వం వహించే అవకాశం ఉంది.

No comments

Powered by Blogger.