బీసీసీఐ మాస్టర్ ప్లాన్: టీమిండియా 2.0
రానున్న రెండు మూడు నెలల పాటు భారత క్రికెట్ జట్టు చాలా బిజీ షెడ్యూల్లో పాల్గొనబోతోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్ ముగిసిన వెంటనే ఐపీఎల్...ఆ తర్వాత ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ కోసం ఇంగ్లాండ్ వెళ్తుంది భారత జట్టు. ఫైనల్ మ్యాచ్ ముగియగానే అక్కడే ఇంగ్లాండ్ తో నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది.
వాస్తవానికి భారత జట్టు టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సమయంలోనే... ఆసియా కప్ టి20 ట్రోఫీలో పాల్గొనాల్సి ఉంది. కానీ, ఇప్పుడు భారత జట్టు టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడుతుండటంతో ఆసియా కప్ పై నీలిమేఘాలు కమ్ముకున్నాయి.
ఈ సమస్యకు బిసిసిఐ కార్యదర్శి జై షా ఒక ప్రత్యామ్నాయాన్ని సూచించారు. భారత జట్టు రెండుగా విడిపోయి అటూ ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఇటు ఆసియా కప్ రెండిటిలో పాల్గొనాలన్నది జై షా ప్రతిపాదన. విరాట్ నేతృత్వం లో... సీనియర్ ఆటగాళ్లను టెస్ట్ ఛాంపియన్ షిప్ కు...రోహిత్ శర్మ నాయకత్వం లో పరిమిత ఓవర్ల స్పెషలిస్టులను...ఆసియా కప్ కు పంపాలని బీసీసీఐ భావిస్తోంది.
ఎంతోకాలంగా పరిమిత ఓవర్ల కోసం టీం ఇండియా కు రోహిత్ నాయకత్వం వహించాలని అతడి అభిమానులు భావిస్తున్నారు. ఎట్టకేలకు , అనూహ్యంగా ఆసీస్ కప్ కు టీం ఇండియా కు రోహిత్ కెప్టెన్ అయితే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.
విరాట్ నేతృత్వం లో టెస్ట్ ఛాంపియన్ షిప్ ను, రోహిత్ సారధ్యం లో ఆసియా కప్ ను టీం ఇండియా గెలిస్తే...అద్భుతంగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.
No comments