టీంఇండియాలో సెహ్వాగ్ అసలు వారసుడు అతడే-ఇంజమామ్

 ఊహించని విధంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పై అద్భుత విజయాలను నమోదు చేసి భారత జట్టు టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్ కు చేరుకుంది. రెండు సిరీస్లోనూ భారత యువ ఆటగాడు రిషబ్ పంత్ అసాధారణ పోరాటపటిమ కనబర్చి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఏమాత్రం ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్ పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ప్రశంసలు కురిపించాడు.

ఇంజమామ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే... "రిషబ్ పంత్ ని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఏమాత్రం ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడుతున్నాడు. ఇంగ్లాండ్తో చివరి టెస్టులో అతడు బ్యాటింగ్కు దిగే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఆ సమయంలో రిషబ్ పంత్ చాలా ధైర్యంగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అతను తన షాట్లు యధేచ్ఛగా కొడుతూనే ఉన్నాడు. అతడిని చూస్తే ఒకప్పటి భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గుర్తుకు వచ్చాడు. సెహ్వాగ్ ఎడమచేత్తో బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది పంత్ బ్యాటింగ్. పిచ్ ఎలాంటిదిి, ప్రత్యర్థి బౌలర్ ఎవరు అనేది ఏమాత్రం పట్టించుకోకుండా విచక్షణా రహితంగా ఆడుతున్నాడు. అంతటి తెగువ నేను సెహ్వాగ్లో మాత్రమే చూశాను. భవిష్యత్తులో రిషబ్ పంత్ ఎన్నో కీర్తి శిఖరాలను చేరుకుంటాడు." అని అన్నాడు. 

 ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో సాహసోపేతమైన ఇన్నింగ్స్ ఆడినట్లే పంత్ ఇంగ్లాండ్తో చివరి టెస్టులో కూడా సాహసోపేతంగా సెంచరీ చేశాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓటమి పాలయ్యేలా చేశాడు. భారత జట్టును ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న టెస్టు చాంపియన్షిప్ ఫైనల్స్ కు అర్హత సాధించేలా చేశాడు.

No comments

Powered by Blogger.