రిషబ్ పంత్ నన్ను మించిపోయేలా ఉన్నాడు-గిల్ క్రిస్ట్
Adam Gilchrist About Rishabh Pant |
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ మెరుపు సెంచరీ సాధించి భారత జట్టును ఆధిక్యంలో నిలిపాడు. ప్రధాన వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత జట్టును వాషింగ్టన్ సుందర్ తో కలిసి సెంచరీ భాగస్వామ్యం నిర్మించి జట్టును ఆదుకున్నాడు. రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ చూసి అభిమానులతో పాటు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ కూడా పులకించి పోయాడు.
ఈ సందర్భంగా ఆడం గిల్ క్రిస్ట్ మాట్లాడుతూ ఏమన్నాడంటే...
"రిషబ్ పంత్ రోజురోజుకి తన బ్యాటింగ్ ను మెరుగు పరుచుకుంటూ ఉన్నాడు. ఎంత స్కోరు సాధించాం అనేదానికంటే... ఎలాంటి సమయంలో స్కోరు చేశాము అన్నది చాలా ముఖ్యం. జట్టు ఒత్తిడిలో ఉన్న సమయంలో పంత్ చాలా స్వేచ్ఛగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఒత్తిడిలో పంత్ సాధించిన ఈ సెంచరీ కలకాలం గుర్తుండిపోతుంది. మొదటి ఇన్నింగ్స్ లానే రెండో ఇన్నింగ్స్ లో కూడా పంత్ మరో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడితే అంతకంటే కావలసింది ఏముంది. చూడబోతే నా కంటే మంచి ఆటగాడిగా పంత్ పేరు తెచ్చుకునేలా ఉన్నాడు. నన్ను మించిపోయేలా ఉన్నాడు" అని గిల్ క్రిస్ట్ ప్రశంసల వర్షం కురిపించాడు..
కేవలం 118 బంతుల్లోనే పంత్ నూటొక్క పరుగులు చేసి అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, భారత్ మూడు చోట్లా సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో పంత్ కూడా చేరిపోయాడు. ఈ ఘనత సాధించిన మొదటి వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్. 23 ఏళ్ల వయసులోనే పంత్ ఈ ఘనత సాధించాడు. అతడు భవిష్యత్తులో ఇంకా ఎన్నో సాధించాల్సి ఉంది.
No comments