న్యూజిలాండ్ కు కోహ్లీ స్వీట్ వార్నింగ్

 భారత జట్టు, ఇంగ్లాండ్ పై సిరీస్ గెలవడంతో టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ అర్హత సాధించింది.  లార్డ్స్ మైదానంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ తో తలపడనుంది.  మొదటి టెస్టు చాంపియన్షిప్ లోనే భారత జట్టును ఫైనల్ల్స్ కు నడిపించిన కెప్టెన్ కోహ్లి ఇంగ్లాండ్ పై సిరీస్ విజయం అనంతరం మీడియాతో మాట్లాడాడు.

విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే...

మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓటమి పాలైనా అద్భుతంగా పుంజుకోవడం నాకు సంతోషాన్నిచ్చింది.  మొదటి మ్యాచ్లో ఇంగ్లండ్ మాకంటే అద్భుతంగా ఆడింది. ఆ మ్యాచ్లో టాస్ కీలక పాత్ర పోషించింది.  మా బౌలర్లు గాడిలో పడటానికి కూడా చాలా సమయం పట్టింది. మొదటి ఇన్నింగ్స్ లో మ్యాచ్ చేజారిన తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్లో చాలా శ్రమించాము.  ఆ తర్వాత మ్యాచ్లలో పుంజుకోవడం సంతృప్తినిచ్చింది. ప్రస్తుతం మా బెంచ్ చాలా బలంగా ఉంది. అది భారత క్రికెట్ జట్టుకు ఎంతో మంచిది.  

మార్పులు జరిగినప్పుడు ప్రమాణాలకు ఏ మాత్రం నష్టం ఉండదు.  ఉదాహరణకి...ఈ మ్యాచ్లో రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ ల భాగస్వామ్యం ఆ  విషయాన్ని నిరూపించింది.  చాలా కీలక సమయంలో వారు జట్టుకు అండగా నిలిచారు.  మొదటి మ్యాచ్ తర్వాత మేము శారీరకంగా మరింత దృఢంగా సిద్ధపడ్డాము.  ప్రపంచ క్రికెట్లో దాదాపు అన్ని జట్లు నాణ్యమైనవే. మా సొంత గడ్డపై కూడా వారిని ఓడించడానికి చాలా శ్రమించాము. జట్టులో ఉత్సాహాన్ని  కోల్పోకుండా జాగ్రత్త పడుతూ ముందుకు సాగాము.  చెన్నైలో రోహిత్ ఇన్నింగ్స్ జట్టుకు ఎంతగానో ఉపయోగపడింది. అశ్విన్ మా జట్టులో నమ్మదగిన బౌలర్.  వారిద్దరూ సుదీర్ఘంగా జట్టు కోసం ఎంతగానో కష్టపడుతున్నారు.  ఇప్పుడు మేము న్యూజిలాండ్ ఫైనల్ కు సిద్ధంగా ఉన్నాము.  2020లో న్యూజిలాండ్ పర్యటనలో మాకు ఎదురైన పరాభవానికి ఇప్పుడు  బదులు తీర్చుకోవాలి." అని అన్నాడు.

మొదటి మ్యాచ్లో ఓటమి ఎదురైనా కుంగిపోకుండా భారత జట్టును అద్భుత విజయాల వైపు నడిపించాడు టీమిండియా కెప్టెన్ కోహ్లి.  ఇదే ఉత్సాహంతో భారత్ ఫైనల్లో న్యూజిలాండ్పై కూడా విజయం సాధించాలని యావత్ భారతావని ఎదురుచూస్తోంది.


No comments

Powered by Blogger.