ఆ మాటలే నాలో కసిని పెంచాయి-రిషబ్ పంత్


భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ భారత జట్టు విజయాల్లో  తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ భారత జట్టు.. టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.  చాలా తక్కువ కాలంలోనే జట్టుకు విలువైన ఆటగాడిగా ఎదిగాడు.  ప్రతికూల పరిస్థితుల్లో సైతం పంత్ తన వంతుగా పరుగులు సాధిస్తూ వస్తున్నాడు.  అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో మొదటి సెంచరీ నమోదు చేసి...భారత జట్టుకు  చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే...

చాలా కాలంగా నా మీద వస్తున్న విమర్శలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి.  బ్యాటింగ్ లోనే కాదు కీపింగ్ లో కూడా నన్ను నేను  మెరుగు పరుచుకున్నాను.  నాలో ఆత్మవిశ్వాసం అంతకంతకూ పెరిగింది.  ముఖ్యంగా ఈ మ్యాచ్లో నా ఇన్నింగ్స్ మరువలేనిది.  జట్టు అవసరాల్లో ఉన్నప్పుడు ఒత్తిడిని అధిగమించి ఈ స్థాయిలో ఆడటం చాలా సంతృప్తినిచ్చింది. 146 పరుగులకే  మా జట్టు ఆరు వికెట్లు కోల్పోయింది.  అలాంటి సందర్భంలో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం కంటే సంతృప్తి ఏముంటుంది.  ఏ ఆటగాడైనా జట్టు అవసరాల్లో ఉన్నప్పుడు అద్భుతంగా ప్రదర్శించాలని కోరుకుంటాడు.  మరోసారి అవకాశం వస్తే ఫాస్ట్ బౌలర్ బౌలింగ్ లో రివర్స్ ఫ్లిక్  ఆడటానికి వెనుకాడను." అని అన్నాడు.

కష్ట సమయంలో రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ కలిసి నమోదు చేసిన సెంచరీ భాగస్వామ్యం జట్టు ఎంతగానో ఉపయోగపడింది.  పంత్ వేగంగా పరుగులు సాధించడం వలన కూడా ఇంగ్లండ్ పై ఒత్తిడి పెరిగింది...టీం ఇండియా విజయం సులభం అయ్యింది.

No comments

Powered by Blogger.