105 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్. వెస్టిండీస్ బోణి

వెస్టిండీస్ దెబ్బకి పాక్ విలవిల

ఇంగ్లాండ్: ప్రపంచకప్ లో భాగంగా  పాకిస్తాన్-వెస్టిండీస్ జట్ల మధ్య ఈ రోజు నాటింగ్ హాం వేదికగా  జరుగుతున్న రెండో మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్ బౌలర్ల ధాటికి 105 పరుగుల స్వల్ప స్కోర్ నమోదు చేసింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బాటింగ్ కు దిగిన పాకిస్తాన్ జట్టులో  ఫకర్ జామాన్, బాబర్ అజాం, మహమ్మద్ హఫీజ్,  వహబ్ రియాజ్ మాత్రమే రెండంకెల స్కోర్ దాటారు. మిగతావారెవ్వరు సరిగ్గా రాణించకపోవడంతో పాకిస్తాన్ జట్టు ఈ ప్రపంచ కప్ లో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో థామస్ నాలుగు, హోల్డర్ మూడు, ఆండ్రూ రస్సెల్  రెండు వికెట్లు తీసి  పాకిస్తాన్ ను కోలుకోలేని దెబ్బ తీశారు.

అనంతరం బాటింగ్ ఆరంభించిన వెస్టిండీస్ జట్టు 46 పరుగులకే రెండు వికెట్స్ కోల్పోయినా ఓపెనర్ క్రిస్ గైల్ అర్ద సెంచరీ సాధించి మంచి ఆరంభాన్ని ఇచ్చి అవుట్ అయ్యాడు. నికోలస్ పూరన్ 34 పరుగులతో చివరి వరకు నిలిచి వెస్టిండీస్ జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. 
Powered by Blogger.