నోటా సినిమా ప్లాప్ అవ్వడానికి 3 కారణాలు ఇవే!


అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద విజయాన్నిసాధించాయి. అదే సమయంలో విజయ్ దేవరకొండ క్రేజ్ కూడా విపరీతంగా పెరిగింది. ఇలాంటి సమయంలో రాజకీయ నేపధ్యం లో సాగే నోటా సినిమా లో విజయ్ నటిస్తున్నాడు అని తెలియడం తో సినిమా ఫై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.అందుకు తగ్గట్లే ట్రైలర్ కూడా సినిమా పై హైప్ ని పెంచింది. ఎట్టకేలకు ఈ శుక్రవారం నోటా సినిమా విడుదలయ్యింది. అంచనాలకు తగ్గట్లు నోటా సినిమా ఆకట్టుకోలేక పోయిందని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు ప్రధానంగా మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

మొదటిది, ప్రేమకథలు, కామెడీ, హారర్ ఇలాంటి జానర్ కు సంబంధించిన సినిమాలు బాగుంటే చాలు, డబ్బింగ్ అయినా కూడా మంచి విజయాన్ని అందుకుంటాయి అని ఇప్పటికే చాలా సార్లు రుజువయ్యింది. కానీ, రాజకీయ నేపథ్యం లో సాగే సినిమా మాత్రం అక్కడి నేటివిటీ కి తగ్గట్లు ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. నోటా సినిమా లో అదే మిస్ అయ్యిందట. సినిమా మొత్తం ఎక్కువగా తమిళ రాజకీయానికి దగ్గరగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేకపోయారని, అందుకే  సినిమా అంతగా నచ్చలేదని ప్రేక్షకులు చెబుతున్నారు.

రెండవది, నోటా చిత్రం లోని సెకండ్ హాఫ్ మరీ ఎక్కువ సాగదీశారని, అవసరానికి మించి హీరో కంటే కూడా ఎక్కువ స్క్రీన్ ప్రజెన్స్ నాజర్, సత్య రాజ్ కు లభించిందని, తెలుగు తనం తన కంటే కూడా, తమిళ ప్రభావం ఎక్కువగా ఉందని, అసలు సినిమా కు నోటా అనే టైటిల్ ఎందుకు పెట్టారో సినిమా చూసిన చాలా మందికి అర్థం కాలేదని, ఈ కారణాల వల్ల సినిమా ఆకట్టుకోలేదని చెబుతున్నారు.

మూడవది, విజయ్ దేవరకొండ కు యూత్ లో ఫాలోయింగ్ ఎక్కువ. మంచి డైలాగ్స్ తో పాటు, హీరోయిజం ఎలివేట్ చేసే సీన్ లు విజయదేవరకొండ సినిమాలో ఉంటాయని, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కాబట్టి మరిన్ని ఆసక్తికర సన్నిశాలు ఉంటాయని చాలా మాది ఆశించారు. కానీ, అవేవి లేకపోవడంతో ప్రేక్షకులు కొద్దిగా నిరాశ చెందారు.  మొత్తానికి విజయ్ దేవరకొండ నోటా లో బాగా నటించినా కూడా సినిమా లో దమ్ము లేకపోవడంతో సినిమాను చూసి సమీక్షలు రాసే వారు పెదవి విరుస్తున్నారు. మరి ఈ సినిమా ఈ వారం ప్రేక్షకులు ఏ మేర ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
Powered by Blogger.