చదువే ఈ చిట్టి తల్లి ప్రాణం తీసింది!ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలు చిన్నారులను ఎలా చిదిమేస్తున్నాయి అని చెప్పే కన్నీటి కథ ఇది.కృష్ణ జిల్లా చాట్రాయి గ్రామంలో రఘపతి రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. కొడుకు ఎదో తరగతి చదువుతున్నాడు, కూతురు మంజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఒక సాధారణ కుటుంబం లో పుట్టిన మంజు, ఎలాగైనా జీవితం లో తన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి అని కలలు కనింది. అందుకు తగ్గట్లు గానే ఎంతో కష్టపడి చదివేది. పదవ తరగతి లో మంచు కు పది కి పది జీపీఏ సాధించింది. ట్రిపుల్ ఐటీ లో కచ్చితంగా సీటు వస్తుందని భావించింది. కానీ, సీటు రాలేదు. దీంతో తన తల్లి దగ్గర ఆవేదనను వెలిబుచ్చింది మంజు. మంజు కు సర్ది చెప్పి ఇంటర్మీడియట్ లో చేర్పించారు తల్లిదండ్రులు.

ఆ జిల్లా లో పదవ తరగతి  లో ఉత్తమ ప్రతిభ చూపించిన ఆరుగురు విద్యార్థులకు ప్రతిభా పురస్కార అవార్డులను గురువారం ప్రకటించింది ప్రభుత్వం. ప్రతిభాపురస్కార అవార్డులలో తన పేరు కచ్చితంగా ఉంటుందని భావించింది. కానీ, ఆ జాబితాలో తన పేరు లేకపోవడం తో మంజు తీవ్రంగా కుమిలిపోయింది, తీవ్రమైన వ్యధ కు లోనయ్యింది, తాను ఇంత కష్టపడి చదివినా ఒక్కసారి కూడా అందుకు తగ్గ గుర్తింపు రాలేదని కలత చెందింది. ఇలా అయితే జీవితం లో కూడా ఓడిపోతానేమో అనే భయం మంజు ని వెంటాడింది. ఇదే విషయాన్ని తల్లి దండ్రులు, స్నేహితుల దగ్గర చెప్పి తీవ్ర మానసిక వేదనకు గురయ్యింది.అందరూ మంజు కి ఎంత చెప్పినా ఆమె మనస్సు మాత్రం నిరాశలోనే కూరుకుపోయింది. తల్లిదండ్రులిద్దరూ మధ్యాహ్నం వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మరణించిన మంజు ని చూసి గుండెలవిసేలా ఏడ్చారు.

ఈ సంఘటనలు చూసిన కొంత మంది ప్రజలు ప్రభుత్వానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు.ఒక విద్యార్ధి పది కి పది జీపీఏ సాధించాడు అంటే అంతకు మించి పదవతరగతి  లో ఉత్తమ ప్రతిభ ఏముంటుంది.అర్హత కలిగిన కూడా మంజు కి ఎందుకు ప్రతిభ పురస్కారం ఇవ్వలేదు. అర్హత కలిగిన వారిలో కొంత మందికి పురస్కారాలు ఇవ్వడం, మరికొంతమందికి ఇవ్వకపోవడం ఇదెక్కడి న్యాయం. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్లే చిన్న పిల్లల జీవితాలు బలైపోతున్నాయి, బంగారు భవిష్యత్తులు నాశనం అవుతున్నాయి, తల్లిదండ్రుల కు విపరీతమైన శోఖాన్ని మిగులుస్తున్నాయి.ఇకనైనా ప్రభుత్వాలు అర్హత గలిగిన విద్యార్ధులందరినీ సమానంగా చూసి, సమన్యాయం చేస్తే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. అదే సమయంలో విద్యార్థులకు మానసికంగా దృడంగా ఉండటానికి పాఠశాలలో ఏవైనా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. మరి మన ప్రభుత్వాలలో ఎప్పుడు చలనం వస్తుందో వేచి చూడాలి.
Powered by Blogger.