భారత అపర కుబేరుడు ముకేశ్ అంబానీ!


దేశంలోనే అపర కుబేరుడిగా తొలి స్థానం మళ్లీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీకే దక్కింది. ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన 100 మంది భారతీయ సంపన్నుల జాబితాలో ముకేశ్ వరుసగా 11వ సారి మొదటి స్థానంలో నిలిచారు. వీరందరి ఆస్తులూ కలిసి సుమారుగా 492 బిలియన్‌ డాలర్లని ఫోర్బ్స్‌ ప్రకటించింది. గత ఏడాది విలువ 479 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 2.7శాతం మేరకు పెరిగింది. ప్రపంచ మార్కెట్లో రూపాయి పతనం, భారత ఆర్థిక వ్యవస్థలో కొన్ని ప్రతికూలతల నేపథ్యంలోనూ ముకేశ్‌ అంబానీ సంపద రూ.68 వేల కోట్లు (9.3 బిలియన్‌ డాలర్లు) పైగా వృద్ధి చెందడం విశేషం. ఇందుకు ప్రధాన కారణం జియో అని చెప్పాలి. విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ రెండో స్థానంలో. ఆర్సెలార్‌ మిట్టల్ ఛైర్మన్‌-సీఈఓ లక్ష్మీ మిట్టల్ మూడు స్థానంలో  నిలిచారు.
Powered by Blogger.