టెస్టుల్లో 24 వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ
వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్టులో మొదటి రోజు యువ ఆటగాడు పృథ్వీ షా సెంచరీ సాధించగా, రెండో రోజు టీమిండియా సారధి విరాట్ కోహ్లీ కూడా సెంచరీ సాధించడంతో భారత్ 500 పైగా పరుగులతో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. 184 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన విరాట్ 139 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. కెరీర్ లో 24 వ సెంచరీ చేసిన కోహ్లీ ఇన్నింగ్స్ లో కేవలం 7 ఫోర్స్ సాధించడం గమనార్హం. ప్రస్తుతం 132 ఓవర్లలో 556 పరుగులకు 7 వికెట్స్ కోల్పోయింది.