స్మార్ట్ ఫోన్ లో ఇలా చేస్తే మీ పని గోవిందా!!స్మార్ట్ ఫోన్ అరచేతిలోకి వచ్చిన తరువాత ప్రపంచం మన గుప్పిట్లోకి వచ్చేసిందన్న ఆనందం ఒక వైపు ప్రపంచాన్ని  పరుగులుపెట్టిస్తోంది. మరోవైపు ఇదే స్మార్ట్ ఫోన్ ని కొంతమంది అనాలోచితంగా వాడటంతో వారి జీవితాలు నాశనం అవుతున్నాయి, కోలుకోలేని వ్యధను మిగులుస్తున్నాయి. అలా ఎందుకు జరుగుతోందో ఇప్పుడు చూద్దాం.

ఎప్పడు గాని మంచి కంటే కూడా చెడు ఎక్కువ ఆకర్షణగా ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం.
స్మార్ట్ ఫోన్ విషయం లో కూడా ఇదే జరుగుతోంది.చాలా మంది యువత స్మార్ట్ ఫోన్స్ లో అశ్లీల వీడియో లను ఎక్కువగా చూసి వాటికి బానిసలుగా మారుతున్నారు అని ఇప్పటికే చాలా మంది ఆందోళన చెందుతున్న క్రమంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. యువతీ యువకులు, అశ్లీల వెబ్సైట్ లను చూసి అందులో ఉన్నట్లు అనుకరించాలి అనే తాపత్రయంలో తమ అశ్లీల చిత్రాలను, నగ్న వీడియోలను సెల్ఫీ కెమెరా ల ద్వారా చిత్రీకరించి వాటిని తమ స్నేహితులకు పంపడం, లేదా తమ స్మార్ట్ ఫోన్ లలో భద్రపసరుచుకోవడం లాంటి పనులు ఎక్కువగా చేస్తున్నారంట. ముఖ్యంగా ఇలా చేస్తున్న అమ్మాయిలు తీవ్రమైన ప్రమాదం లో పడ్డట్లేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందుకు కొన్ని కారణాలను చెబుతున్నారు.

ఇలాంటి అసభ్యకర వీడియో లు, నగ్న చిత్రాలను స్నేహితులకు పంపడం ద్వారా అవి విపరీతంగా సామాజిక మాధ్యమాల్లో, స్మార్ట్ ఫోన్ లలో విపరీతంగా షేర్ అవుతున్నాయని, కొత్త మంది వీటిని చూపించి అమ్మాయిలను డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు లోబర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారట. వీటికి తోడు ఎవరైనా స్మార్ట్ ఫోన్ లను పోగొట్టుకుంటే, ఆ ఫోన్ లను అన్ లాక్ చేసి ఒకవేళ అలాంటి వీడియో లు, చిత్రాలు గనుక ఉన్నట్లయితే, సంబంధిత బాధితులకు ఫోన్ చేసి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారంట, డబ్బులు ఇవ్వకుంటే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తాం అని బెదిరిస్తున్నారట. ఇందుకు సంబంధించి ప్రతి రోజు కేసులు నమోదవుతున్నాయని, కాబట్టి యువతీ యువకులు జాగ్రత్తగా వ్యవహరించి తమ జీవితాన్ని నవ్వులపాలు కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని, ఎవ్వరు నగ్నంగా సెల్ఫీ వీడియో లను, చిత్రాలను తీసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ని స్మార్ట్ గా వాడకపోతే మన జీవితాన్ని బజారు పాలు చేస్తుంది, ప్రపంచం ముందు సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి, ఆనందంగా జీవితాన్ని గడపండి.


Powered by Blogger.