పెళ్లి సందడి హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూడండి!


ఈ ప్రపంచంలో  ఏ ప్రాణికైనా ఒక దశ దాటిన తరువాత, వయసు పెరుగుతున్న కొద్దీ అందం తరుగుతుంది ఇది జగమెరిగిన సత్యం. కానీ, కొంతమంది మాత్రం వయస్సు  తో సంబంధం లేకుండా చాలా యవ్వనంగా కనిపిస్తారు. అలాంటి వారిలో అలనాటి హీరోయిన్ దీప్తి భట్నాగర్ కూడా ఒకరు. పెళ్లి సందడి, ఆటో డ్రైవర్, సుల్తాన్, మా అన్నయ, కొండవీటి సింహాసనం వంటి తెలుగు చిత్రాలతో పాటు హిందీ, తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది, మెప్పించింది.

ఉత్తరప్రదేశ్ మీరట్ కు చెందిన దీప్తి భట్నాగర్ కు రణదీప్ ఆర్య అనే దర్శకుడితో వివాహమయ్యింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ప్రస్తుతం దీప్తి వయసు 51 సంవత్సరాలు. సెప్టెంబర్ 30 దీప్తి భట్నాగర్ పుట్టిన రోజు కావడంతో తన ఫోటోని ఒకటి అప్లోడ్  చేసింది. ఆ ఫోటో లో దీప్తి భట్నాగర్ అందాన్ని చూసిన చాలా మంది నెటిజన్లు నోరెళ్ళ బెడుతున్నారు.  51 సంవత్సరాల వయసు లో ఇంత అందంగా ఉండటం ఎలా సాధ్యం, ఏ కుర్ర హీరోయిన్ కి తీసిపోకుండా ఉంది మీ అందం , మాకు కూడా కొద్దిగా ఆ రహస్యం చెప్పొచ్చు కదా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి దీప్తి ఆ రహస్యాన్ని బయటపెడుతుందో లేదో తెలీదు కానీ, ప్రస్తుతానికైతే దీప్తి భట్నాగర్ అందమైన ఫోటోలు  కింద ఉన్న వీడియోలో మీరు కూడా చూసెయ్యండి.

Powered by Blogger.