కోడలి కోసం అత్త చేసిన త్యాగం!


అత్తాకోడళ్ల  మధ్య  అనుబంధాన్ని చాటి చెప్పిన సంఘటన ఇది.  కుటుంబాల్లో సాధారణంగా  అత్తాకోడళ్లు అంటే మనకు గుర్తు వచ్చేది వాళ్ళ మధ్య జరిగే గొడవలే అన్న  పాత  భావనని  తుడిచేసారు రాజస్థాన్ కు చెందిన ఈ అత్తాకోడళ్లు. వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్ లోని బార్మేర్ జిల్లాలోని గాంధీనగర్ ప్రాంతంలో గనీ దేవి, సోనిక  అనే ఇద్దరు అత్తాకోడళ్లు నివసిస్తున్నారు. తన కోడలు సోనిక  ప్రాణాపాయ స్థితిలో  ఉన్నపుడు ఆదుకునేందుకు  ఆమె తరుపు రక్త సంబంధీకులు సైతం నిరాకరించిన నేపథ్యంలో తానే  సాయం చేయడానికి ముందుకు వచ్చి చూపించిన ఔదార్యం , దైర్యంతో అందరికి ఆదర్శంగా నిలిచింది.

సోనికకు రెండు మూత్రపిండాలు పాడైపోయాయి. ఆమె బతకాలంటే మూత్రపిండ మార్పిడి తప్ప వేరే మార్గం లేదని ఢిల్లీ లోని ఆసుపత్రి వైద్యులు సూచించారు. సోనికా తల్లి భన్వరీ దేవితో పటు, సోదరుడు కూడా కిడ్నీ దానం చేయడానికి నిరాకరించారు . దీంతో కోడలు ప్రాణాన్ని కాపాడేందుకు అత్తగారు గనీ  దేవి ముందుకు వచ్చి తన కిడ్నీ ని కోడలికి దానం చేసింది. సెప్టెంబర్ 13 న ఆపరేషన్ అనంతరం ప్రస్తుతం సోనికా పూర్తిగా కోలుకుంది. తనకు పునర్జన్మ ప్రసాదించిన అత్తగారికి కన్నీటితో కృతఙ్ఞతలు తెపిపింది. గని దేవి కూడా ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో కుటుంబ సభ్యులు ఆనందంగా ఉన్నారు.


Powered by Blogger.