'ఎస్-400' తో భారత రక్షణా వ్యవస్థ ఇక శత్రు దుర్భేద్యం.


దేశరక్షణ కోసం అధునాతన ఆయుధ సంపత్తిని ముఖ్యంగా అమెరికా, రష్యా, ఫ్రాన్స్ మరియు ఇజ్రాయెల్  దేశాల దగ్గరనుండి వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఎన్నో ఆయుధాలను మన ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటుంది. సరిహద్దుల దగ్గర నిఘా పెంచడంతో పాటు, శత్రు దేశాలు చేసే క్షిపణి దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడానికి మన దగ్గర సరైన నిఘా వ్యవస్థ లేదు. మన సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, చైనా నుండి మనకు ఎప్పుడు ముప్పు పొంచి ఉంటుంది. అందుకే రష్యా దగ్గర ఉన్న అత్యాధునిక ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత్ ముందడుగు వేసింది.
 రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మధ్య దాదాపుగా రూ.40,000 కోట్లతో ఎస్-400 కొనుగోలు ఒప్పందం జరిగింది.

ఎస్-400 ప్రత్యేకతలు:

 ఉపరితలం నుండి గాల్లోని లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థల్లో అమెరికాకు చెందిన పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ కన్నా  ఎస్-400 చాలా అధునాతనమైనది. 400 కిలోమీటర్ల పరిధిలోని మానవరహిత, సహిత విమానాలు.. క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను ఇది సమర్థవంతంగా ఛేదించగలుగుతుంది. రాడార్ ను స్తంబింపచేసే యంత్రాలు కూడా దీనిపై ప్రభావం చూపలేవు. ఇప్పటికే చైనా దీన్ని కొనుగోలు చేసింది.

Powered by Blogger.