మొబైల్ రివేంజ్ అంటే ఇదే!


సమాజంలో రోజు రోజు కి హైటెక్ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.తమకు నచ్చని వ్యక్తులను వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టాలి అని భావించే ఆకతాయిలు ఈ మధ్య ఎంచుకుంటున్న మార్గమే మొబైల్ రివెంజ్. అసలు మొబైల్ రివెంజ్ అంటే ఏంటి..? ఈ సమస్య గనుక మనకు ఎదురైతే ఎలా అడ్డుకట్ట వేయాలో ఇప్పుడు చూద్దాం.

కొంత మంది అమ్మాయిలకు తరచూ గుర్తు తెలియని వ్యక్తుల నుండి తమ మొబైల్ ఫోన్స్ కి కాల్స్ వస్తున్నాయి.ఫోన్ ఎత్తగానే " మీరు కాల్ గర్ల్ కదా...ఎంత తీసుకుంటారు.." అంటూ ఇలా రకరకాల అడ్డమైన ప్రశ్నలు చాలా మంది అడుగుతున్నారు. దీంతో అమ్మాయిలు తీవ్ర మానసిక వేదనకు, భయాందోళనలకు గురవుతున్నారు. అమ్మాయిల పరిస్థితి ఇలా ఉంటే, అబ్బాయిల మరోలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు అబ్బాయిలకు ఫోన్ చేసి, మీరు కాల్ గర్ల్స్ ని సప్లై చేస్తారంట కదా...రేట్ ఎంత... లాంటి ప్రశ్నలు అడుగుతున్నారు.ఇలాంటి సమస్యలను ఎవరైనా ఎదుర్కొంటున్నట్లైతే, ఈ తరహా దాడులను మొబైల్ రివెంజ్ అంటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయానికి సంబంధించి పోలీసులు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.

కొంత మంది వ్యక్తులు తమకు నచ్చని వ్యక్తుల ఫై పగ తీర్చుకోవాలి, లేదా ఇబ్బంది పెట్టాలి అని భావించి, ఆయా వ్యక్తుల ఫోన్ నంబర్లకు అందమైన అమ్మాయిల ఫోటోలను జత చేసి అశ్లీల వెబ్సైట్ లలో పెట్టేస్తున్నారు. దీంతో ఆయా సైట్ లకు వెళ్లే వ్యక్తులు అక్కడున్న ఫోన్ నంబర్లు నిజమైనవే అని భావించి వాటికి ఫోన్ చేస్తున్నారు.ఇలాంటి మొబైల్ రివెంజ్ వంటి పనుల వల్ల చాలా మంది వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం గురించి పోలీస్ లు కొన్ని నమ్మలేని నిజాలను వెల్లడించారు. వీటి నుండి తమను తాము ఎలా కాపాడుకోవాలో కూడా సూచనలు చేశారు. సాధారణంగా మనకు బాగా తెలిసిన వ్యక్తులే ఇలాంటి పనులకు పాల్పడుతుంటారు. మీ వ్యవహారశైలి వారికి నచ్చకపోవడమో లేక మీ ఫై వివిధ కారణాల చేత ఆ వ్యక్తిలో ఏర్పడ్డ ఈర్ష్య, అసూయ, ద్వేషం అతనితో ఇలాంటి పనులను చేపిస్తాయి. మీరేమో బాధితులుగా మారుతుంటారు.

ఇలాంటి సమస్యలను ఎవరైనా ఎదుర్కొంటున్నట్లైతే సైబర్ క్రైమ్ విభాగానికి వెంటనే సమాచారం అందించండి. ఇలా ఆకతాయి పనులు చేస్తున్న వ్యక్తులను గుర్తించి, ఆయా వ్యక్తుల ఫై కఠిన చర్యలు తీసుకుంటాము, సమస్య తీవ్రతను బట్టి క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలు కి కూడా వారిని పంపించడం జరుగుతునిది అని హెచ్చరిస్తున్నారు పోలీసులు. మరి ఎవరైనా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటుంటే వెంటనే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయడం మాత్రం మర్చిపోకండి.
Powered by Blogger.