ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ కు ప్రమాదం!
ప్రపంచ క్రికెట్ లో తమదైన ముద్ర వేసిన అతికొద్ది మంది క్రికెటర్స్ లో మాథ్యూ హెడెన్ కూడా ఒకరు. మాథ్యూ హెడెన్ మైదానంలో అడుగుపెట్టాడంటే బౌలర్లకు చెమటలు పట్టించేవాడు. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన అతివిధ్వంసకార బ్యాట్సమెన్ లలో మాథ్యూ హెడెన్ కూడా ఒకరు. అలాంటి వ్యక్తి వయసు మీదపడటంతో క్రికెట్ కు వీడ్కోలు చెప్పి తన శేషజీవితాన్ని ఆనందంగా ఆస్ట్రేలియా లో గడుపుతున్నాడు. అలాంటి వ్యక్తికి ఊహించని ప్రమాదం చేటుచేసుకోవడం తో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు షాక్ అయ్యారు.
మాథ్యూ హెడెన్ తన కుటుంబంతో కలిసి ఆహ్లాదకరంగా గడపడానికి క్వీన్స్‌లాండ్ దీవులకు వెళ్ళాడు. అక్కడ తన కొడుకుతో కలిసి సరదగా సర్ఫింగ్ అనే ఆటను ఆడాడు. అలా ఆడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు పట్టుకోల్పోవడం తో క్రిందపడ్డాడు. తలభాగం బలంగా బోటు కు తగలడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ విషయం తెలియగానే మాథ్యూ హెడెన్ అభిమానులు, క్రికెట్ ప్రేమికులు తీవ్రమైన ఆందోళనకు లోనై మాథ్యూ హెడెన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించడం మొదలుపెట్టారు. అభిమానులు చూపించిన అభిమానాన్ని చూసి భావోద్వేగానికి లోనైనా మాథ్యూ హెడెన్ తన ఇంస్టాగ్రామ్ లో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు.
" నాకు బాగానే ఉంది. ఈ కష్టసమయంలో నాకు అండగా ఉన్న ప్రతిఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను పరీక్షించిన వైద్యులు, నా తల, మెడ తో పాటు శరీరంలోని మరికొన్ని భాగాలకు తీవ్రమైన గాయాలు అయినట్లు తెలిపారు. కాబట్టి కొన్ని రోజులు నేను ఆటకు దూరం కావాల్సి వస్తోంది. నేను త్వరలోనే కోలుకుంటాను" అని చెప్పి తన ప్రస్తుత పరిస్థితిని తెలియజేస్తూ ఒక ఫోటో పెట్టాడు. మాథ్యూ హెడెన్ పెట్టిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మాథ్యూ హెడెన్ త్వరగా కోలుకొని మళ్ళీ సాధారణ స్థితికి చేరుకోవాలని ఆశిద్దాం.