చరణ్-ఎన్టీఆర్-మహేష్ మల్టీస్టారర్!టాలీవుడ్ టాప్ హీరో లలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఎన్టీఆర్ నటించిన అరవింద సామెత సినిమా ఈ వారం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు సినిమా ఫై అంచనాలను విపరీతంగా పెంచేసాయి. మరి ఈ సినిమా ఎన్ని కొత్త రికార్డులను సృష్టించబోతోంది అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, మీడియా సమావేశం లో ఎన్టీఆర్ చెప్పిన కొన్ని విషయాలు సంచలనంగా మారాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు ఈ ముగ్గురు టాప్ హీరోలు మంచి మిత్రులనే విషయం అందరికీ తెలుసు. వీరి మధ్య ఉన్నస్నేహం గురించి ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.

అరవింద సమేత తరువాత రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్ తో కలిసి  నేను నటించబోతున్నాను. రామ్ చరణ్ తో కలిసి నటించడం ఓ మంచి అనుభూతి. నాకు, చరణ్ కి మహేష్ బాబు కి మధ్య ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మేము ముగ్గురం కలిసి ఒకే సినిమాలో నటించడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మేము కలిసినప్పుడు కూడా ఇదే విషయమై చాలా సార్లు చర్చించాము . కానీ, ముగ్గురు హీరో లను ఒకే సినిమాలో నటింపజేయడం కత్తిమీద సాము లాంటి వ్యవహారం. ఏ దర్శకుడు ఇలాంటి వ్యవహారాలను హ్యాండిల్  చేయగలడు? ఏ దర్శకుడైనా మంచి కథ ను సిద్ధం చేస్తే ముగ్గురం కలిసి ఒకే సినిమాలో నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అన్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ చెప్పిన ఈ మాటలు సినీ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచుతున్నాయి. అదే సమయంలో టాప్ హీరోలు ఎలా అయితే స్నేహంగా ఉన్నారో, అలానే వారి అభిమానులు కూడా ఆవేశకావేశాలకు పోకుండా స్నేహంగా ఉంటే ఇంకా బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ భారీ మల్టీస్టార్ సినిమా ఎప్పుడు మొదలుకాబోతోంది, ఈ ప్రాజెక్ట్ ని ఛాలెంజిగ్ గా తీసుకునే దర్శకుడు ఎవడు అనే విషయం తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
Powered by Blogger.