కౌశల్ కి డాక్టరేట్ ఇస్తుంది ఇందుకేనా?
కౌశల్ బిగ్ బాస్ టైటిల్ ని గెలుస్తాడని చాలా మంది ప్రజలు ముందుగానే ఊహించారు . మెజారిటీ ప్రేక్షకులు కోరుకున్నట్లుగానే కౌశల్ విజేతగా నిలిచాడు. టైటిల్ గెలిచినప్పటి నుండి ప్రతి రోజు కౌశల్ ఎదో ఒక ఆసక్తికర విషయాన్ని చెబుతూనే ఉన్నాడు. శనివారం రోజున మరో విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.ఒక యూనివర్సిటీ నుండీ తనకు కాల్ వచ్చిందని, ఆ యూనివర్సిటీ వాళ్ళు తనకు డాక్టరేట్ ఇవ్వబోతున్నారని, ఎందుకు ఇస్తున్నారు అనే విషయాన్ని అతి త్వరలో తానే వెల్లడిస్తాను అని చెప్పుకొచ్చాడు కౌశల్. అసలు కౌశల్ కు ఎందుకు డాక్టరేట్ ఇవ్వబతున్నారు? కేవలం బిగ్ బాస్ గెలిచినందుకు కౌశల్ కు డాక్టరేట్ ని ఇచ్చేస్తారా...అసలు కారణం ఏమై ఉంటుంది అని చాలా మంది ప్రేక్షకులు ఆలోచిస్తున్న తరుణం లో ఒక ఆసక్తికర విశ్లేషణ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అది మీ కోసం.
కేవలం బిగ్ బాస్ గెలిచినందుకే కౌశల్ కు డాక్టరేట్ ఇవ్వడం లేదు. అది ఒక కారణం మాత్రమే. అంతకు మించిన కారణాలు చాలానే ఉన్నాయి. అతి సాధారణ కుటుంభం లో జన్మించి చాలా కష్టపడి 1998 లో మిస్టర్ ఇండియా పోటీ లో, టాప్ 6 ఫైనలిస్ట్స్ లో ఒకడిగా నిలిచాడు. ఎన్నో సినిమాలతో పాటు, సీరియల్స్ లో నటించాడు.ఎంతో మంది మోడల్స్ ని తయారు చేసాడు, వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. మోడల్, యాక్టర్, యాడ్ ఫిలిం డైరెక్టర్, ది లుక్స్ ప్రొడక్షన్స్ అనే మోడలింగ్ కంపెనీ కి సీఈఓ, కాన్సెప్ట్ క్రియేటర్, అన్నిటికి మించి మానవత్వం తో పాటు మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఇలా ఎన్నో సుగుణాలు, లక్షణాలు కౌశల్ లో ఉన్నాయి. కసి పట్టుదల, ఓపిక, మల్టీ టాలెంటెడ్ ఇలా ఎన్నో వ్యాఖ్యలకు కేర్ అఫ్ అడ్రస్ కౌశల్ అనుకునేలా బిగ్ బాస్ హౌస్ లో తన టాలెంట్ ని ప్రదర్శించాడు. అంతే కాకుండా, 2017 వ సంవత్సరంలో భారతదేశం లో బెస్ట్ మల్టీ టాస్కర్ అవార్డు ని గెలుచుకున్నాడు. ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించాలి అనే తన కలను, ఇన్ని సంవత్సరాల తరువాత బిగ్ బాస్ షో ద్వారా సాకారం చేసుకున్నాడు, బిగ్ బాస్ విజేతగా నిలిచాడు కౌశల్. ఎవ్వరికి సాధ్యం కాదేమో అని అనిపించేలా, రికార్డు మెజారిటీ తో బిగ్ బాస్ టైటిల్ ని గెలుచుకున్నాడు, గెలిచిన డబ్బుని విరాళంగా ప్రకటించాడు. బిగ్ బాస్ లో తాను సాధించిన ఓట్ల ద్వారా ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.కౌశల్ సాధించిన విజయాలు, అతడి వ్యక్తిత్వం, చేసిన పనులు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాయి, నిలుస్తాయి అనే కారణం చేత కౌశల్ కు డాక్టరేట్ ఇస్తున్నారు అని భావిస్తున్నారు. మరి కొంత మంది చెప్తున్న ఈ కారణాలు వల్లనే కౌశల్ కు డాక్టరేట్ ఇస్తున్నారా లేక మరేదైనా కారణం ఉందా తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.