త్రివిక్రమ్ నీకెంత దైర్యం

ఈ దసరా కు విడుదలైన అరవింద సమేత సినిమా గురించి, అటు సామాన్యులు, విశ్లేషకులతో పాటు ఇటు సెలెబ్రిటీలు కూడా సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం ఫై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరో వైపు బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త రికార్డులు సృష్టిస్తోంది. రెండు రోజుల్లోనే దాదాపు వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. ఎన్టీఆర్ స్టామినా కు, త్రివిక్రమ్ చరిష్మా తోడైతే అదే అరవింద సమేత అంటూ సినీ అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.

ఇప్పుడు లేటెస్ట్ గా దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్రం చూసి స్పందించిన విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది."యుద్ధం జరిగిన తరువాత చోటుచేసుకునే పరిణామాలను కథాంశంగా తీసుకున్నారు. త్రివిక్రమ్ గారు ఈ సినిమాను చాలా ధైర్యం చేసి ఆ కథాంశంతో మొదలు పెట్టారు. అది వెండితెర ఫై చాలా అద్భుతంగా పండింది. ఆ సీన్ లో తారక్ నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అది ఎంతో కాలం పాటు అలానే గుర్తుండిపోతుంది. జగపతి బాబు గారు కూడా విలన్ గా అదరగొట్టేసారు. అరవింద సమేత చిత్రాన్ని తీయడంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు" అంటూ ముగించాడు రాజమౌళి. రాజమౌళి పెట్టిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Powered by Blogger.