పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతాడు:కేశినేని నాని
సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతాడని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని జోస్యం చెప్పారు. విలేకరులతో నాని మాట్లాడుతూ..వాళ్ల అన్నయ్య చిరంజీవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 18 సీట్లు మాత్రమే గెలిచారనే విషయాన్ని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ ఒక యాక్టర్, అతన్ని చూడటానికి మాత్రమే ప్రజలు వస్తారు..అంతే కానీ వాపును చూసి బలుపు అనుకోకూడదని హితవు పలికారు. పవన్ కల్యాణ్ తన బలం, బలహీనత తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు.