కేరళకు మరో ప్రళయ హెచ్చరిక!భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళకు మరో ప్రళయ భయం వెంటాడుతోంది. వాతావరణ శాఖ సమాచారం మేరకు రానున్న శనివారం, ఆదివారాల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు ప్రకటించింది. ఈ హెచ్చరికల నేపథ్యం కేరళ సీఎం పినరయి విజయన్‌ తీరంలోని మూడు జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. దీనిపై కేంద్రంతో ఇప్పటికే చర్చలు జరిగిన సీఎం.. వరదల సమయంలో సహాయ చర్యలు చేపట్టేందుకు కేంద్ర బలగాలకు రాష్ట్రానికి పంపాలని కోరారు.

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తీర ప్రాంతాలకు ఎవ్వరూ కూడా చేపల వేటకు వెళ్లవద్దని, రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన మూడు జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. కాగా ఇటీవల సంభవించిన వరద బీభత్సం నుంచి ఇప్పుడే కోలుకుంటున్న కేరళ ప్రజలకు వర్ష  సూచన భయాందోళనకు గురిచేస్తోంది. కేరళలో ఇటీవల సంభవించిన భారీ వర్షలకు 350 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. దాదాపు 30,000 కోట్ల ఆస్థి నష్టం వాటిల్లింది.
Theme images by sbayram. Powered by Blogger.