ఈ 5 కారణాల వల్లే కౌశల్ బిగ్ బాస్ విజేత అయ్యాడు!
మెజారిటీ ప్రేక్షకులు కోరుకుంటున్నట్లుగానే కౌశల్ బిగ్ బాస్ విన్నర్ గా టైటిల్ ని గెలుచుకున్నాడు, ప్రస్తుతం తన భవిష్యత్తుని మరింత ఎత్తుకు తీసుకెళ్లే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఈ విషయాన్ని పక్కన పెడితే, కౌశల్ కు సంబంధించి ఓ అయిదు విషయాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కౌశల్ ప్రత్యేకతను చాటిచెబుతున్నాయి. అవి మీ కోసం.
మొదటిది, బిగ్ బాస్ హౌస్ లో ఒక సారి తమకు తాము ర్యాంకింగ్ ఇచ్చుకోమని బిగ్ బాస్ చెప్పినప్పుడు, మూడో నెంబర్ ర్యాంక్ దగ్గర నిల్చున్నాడు, ఆ స్థానం కోసం దీప్తి తో వాదులాడి, ఆ వారం నామినేట్ కూడా అయ్యాడు. మూడు తన లక్కీ నెంబర్ అని, ఎప్పుడు ఆ స్థానం లో నిల్చున్నా గెలుపు నాదే అని భల్ల గుద్ది చెప్పాడు. కౌశల్ పెట్టుకున్న నమ్మకం నిజమని కౌశల్ గెలుపు చెబుతోంది.
రెండవది, ఇప్పటివరకు తెలుగు లో జరిగిన రెండు బిగ్ బాస్ సీజన్ లను గమనిస్తే ఏ కంటెస్టెంట్ లో లేని ఒక ప్రత్యేక గుణం కౌశల్ లో ఉంది. అదేంటంటే, ప్రేక్షకులు ఏమి అనుకుంటున్నారు అనే విషయాన్ని అచ్చు గుద్దినట్లు చాలా సందర్భాల్లో విశ్లేషించి చెప్పాడు. ఈ లక్షణం బిగ్ బాస్ లో కౌశల్ గెలుపు కు ఎంతగానో ఉపయోగపడింది.
మూడవది, కౌశల్ ని, గీత మాధురి ని బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ చేస్తాను, గెలవనివ్వను అని బాబు గోగినేని శపథం చేసాడు. కానీ, ఆ తరువాత చివరి వారంలో ఒకానొక టాస్క్ లో కౌశల్ మాట్లాడుతూ, తనతో పాటు గీత మాధురి ఫినాలే లో స్టేజి పైన ఉంటే బాగుంటుందని కౌశల్ చెప్పాడు. విచిత్రం ఏంటంటే కౌశల్ ఏ విషయమైతే చెప్పాడో అదే జరిగింది. ఫినాలే లో కౌశల్ తో పాటు గీత మాధురి స్టేజి పైన ఉంది.
నాలుగు, తనకు ప్రేక్షకులు అభిమానం చాలు, అందుకే బిగ్ బాస్ హౌస్ కి వచ్చాను అని ముందుటి నుండి కౌశల్ చెబుతూనే ఉన్నాడు. చెప్పిన మాటకు కట్టుబడ్డాడు. ప్రేక్షకుల మనస్సుని గెలుచుకున్నాడు, గెలిచిన డబ్బుని క్యాన్సర్ బాధితుల కోసం విరాళంగా ప్రకటించాడు.
అయిదవది, బిగ్ బాస్ హౌస్ నుండి ప్రతి వారం ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు, అనే విషయాన్ని ఊహించడం లో కౌశల్ చాలా సిద్ధహస్తుడు. టైటిల్ గెలిచిన తరువాత ఒకానొక ఇంటర్వ్యూ లో కౌశల్ మాట్లాడుతూ, ఎవరెవరు ఫినాలే లో ఉంటారు, ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయాన్ని దీప్తి తో చెప్పానని, అదే విధంగా జరిగిందని చెప్పుకొచ్చాడు కౌశల్. కౌశల్ బిగ్ బాస్ హౌస్ లో ఎంత సూక్ష్మంగా ఆలోచించేవాడు, ఎంత ఖచ్చితత్వంతో విశ్లేషణ చేసేవాడు అనే విషయం ఈ సందర్భాలని చూస్తే అర్థం అవుతోందని అభిమానులు కౌశల్ ఫై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.