మహేష్ బాబు ట్వీట్ కి కౌశల్ రిప్లై చూసారా?
కౌశల్ గెలుపు ని జీర్ణించుకోలేక, కౌశల్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని చూసి ఓర్వలేక ఇప్పటికి చాలా మంది కౌశల్ ఫై, కౌశల్ అభిమానుల ఫై బురద జల్లుతున్నారు. కానీ, అలాంటి వాళ్లందరికీ దిమ్మ తిరిగేలా కౌశల్ విజయాన్ని అభినందిస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక ట్వీట్ పోస్ట్ చేసాడు. ఆ ట్వీట్ కు 60 వేల లైకులు, పది వేల కు పైగా రి ట్వీట్లు, రెండున్నర వేల కామెంట్లు వచ్చాయి. ప్రస్తుతం కౌశల్ కు ఎంత క్రేజ్ ఉందొ చెప్పడానికి ఈ విషయం అద్దం పడుతోంది అంటున్నారు అభిమానులు.
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి, ఈ రోజు ఈ స్థాయి లో ఉండటానికి మహేష్ బాబు కారణం అని చెప్పిన కౌశల్, సూపర్ స్టార్ స్వయంగా తాను సాధించిన విజయాన్ని అభినందించడంతో ఆనందపడిపోయాడు. ఫేస్ బుక్ లైవ్ లో మహేష్ బాబు కు ధన్యవాదాలు చెప్పాడు. ట్విట్టర్ పెద్దగా వాడకపోయినా అదే పనిగా నిన్న అర్థరాత్రి మహేష్ బాబు కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ పెట్టాడు."నా ప్రిన్స్ మహేష్ బాబు పెట్టిన ట్వీట్ కు కృతఙ్ఞతలు తెలుపుతున్నాను. మీ అభినందనలు నాకు చాలా విలునైనవి. మీతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. చాలా కాలం అవుతోంది" అని రాసుకొచ్చాడు కౌశల్.
సూపర్ స్టార్ మహేష్ బాబు కు సమాధానమిస్తూ కౌశల్ పెట్టిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
మహేష్ బాబు, కౌశల్ ఇద్దరు కలిసి ఒక సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అభిమానులు కోరుకుంటున్న ఆ కోరిక నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.