WTC ఫైనల్ లో ఇండియానే గెలుస్తుంది-గంగూలీ
ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ వేదిక మారుతున్నట్లు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి తొలుత ప్రకటించినట్లుగా ఈ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లార్డ్స్ మైదానంలో జరగాల్సి ఉంది. కానీ, అక్కడ బయో సెక్యూర్ వాతావరణానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. అంతేకాకుండా ఆటగాళ్లకు ఫైవ్ స్టార్ సదుపాయాలు కూడా అందుబాటులో లేకపోవడంతో వేదికను మార్చారు. ఇక ఈ వేదిక విషయం తో పాటు...ఫైనల్స్ విజేత విషయం లో గంగూలీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
గంగూలి మాట్లాడుతూ ఏమన్నాడంటే...
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో భారత్ గెలుస్తుందన్న నమ్మకం నాకుంది. ముందుగా నిర్ణయించినట్లు ఫైనల్స్ లార్డ్స్ వేదికలో కాకుండా సౌతాంప్టన్ లో జరగనుంది. ఈ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుంది. భారత ఆటగాళ్లు అక్కడ తమ సత్తా చాటుతారనే అనుకుంటున్నాను. టీం ఇండియా విజయం సాదిస్తుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. దీనికి తోడు...సౌతాంఫ్టన్ పిచ్ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుండడంతో...టీం ఇండియా కు గెలుపు అవకాశాలు రెట్టింపయ్యాయి.
లార్డ్స్ తో పోలిస్తే సౌతాంప్టన్ లో ఫైవ్ స్టార్ సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంగ్లాండ్ పై భారత జట్టు సాధించిన విజయం అపురూపమైనది. ఈ విజయానికి భారత కెప్టెన్గా కోహ్లీ కోచ్ రవిశాస్త్రి ఆటగాళ్లు ఇతర జట్టు బృందం అందరూ కారణమే. ఎవరి బాధ్యత వారు సక్రమంగా నిర్వహించారు. ఇది సమిష్టి విజయం. తెరవెనుక యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో రాహుల్ ద్రావిడ్ పాత్ర అనిర్వచనీయమైనది. సౌతాంప్టన్ లో జరిగే ఫైనల్ వీక్షించడానికి నేను స్వయంగా హాజరవుతాను." అని అన్నాడు.
టీమిండియా కెప్టెన్ కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు సమిష్టిగా రాణించి ఫైనల్కు అర్హత సాధించింది. చివరి అంకంలో కూడా భారత ఆటగాళ్లు రాణించి టైటిల్ సొంతం చేసుకోవాలని భారతీయులంతా ఎదురుచూస్తున్నారు.
No comments