ఆ జట్టుని తక్కువ అంచనా వేయొద్దు-సచిన్ టెండూల్కర్
ప్రపంచ కప్ సందర్భంగా తమ్మ జట్టు గెలుపుకోసం అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా సలహాలు సూచనలు ఇస్తున్నారు. భారత జట్టు మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కూడా పలు సూచనలు చేసాడు. ఈ ప్రపంచ కప్ లో ఏ చిన్న జట్టుని కూడా తక్కువ అంచనా వేయకూడదని ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన వార్మ్ అప్ మ్యాచ్ లో ఆ జట్టు ఎలా విజయం సాధించిందో అలాగే తనదైన ఆటతో ఏ జట్టునైనా మట్టి కరిపించగల సత్తా ఆ జట్టుకుందని చెప్పుకొచ్చాడు. సెమి ఫైనల్ కు చేరాలంటే ప్రతి మ్యాచ్ ని జాగ్రత్తగా ఆడాలని చెప్పాడు. మరిన్ని వివరాల కోసం కింద ఉన్న వీడియో చూడగలరు.