"ఇడియట్" అన్నందుకు 6 నెలల జైలు 3 లక్షల జరిమానా
పొరపాటున ఎదో తమాషాగా కాబోయే భార్యతో భర్త అన్న మాటకు కటకటాలపాలు అయిన సంఘటన దుబాయ్ లో చోటు చేసుకుంది. దుబాయ్ చట్టాలు ఎంత దారుణంగా ఉంటాయో అందరికి తెలిసిందే. రాజు, ధనిక, పేద, చివరకు భార్య, భర్త అనే తేడా కూడా ఉండదు అక్కడ చట్టాలకు. ఖలీజ్ టైమ్స్ కథనం ప్రకారం దుబాయిలో ఒక వ్యక్తి తన కాబోయే భార్యతో వాట్సాప్ చాటింగ్ చేస్తూ సరదాగా 'ఇడియట్' అని మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ ను తప్పుగా అర్ధం చేసుకొన్న ఆమె, తనకు కాబోయే భర్త పై కేసు పెట్టింది. అక్కడితో ఆగకుండా, తనకు న్యాయం జరగాలి అని కోర్ట్ వరకు వెళ్ళింది. విచారణ జరిపించిన దుబాయ్ కోర్టు అతనికి జరిమానా తో పాటు, జైలు శిక్ష కూడా విధించిందట. 60 రోజులు జైలు శిక్షతో పాటు, 20 వేల ధీరమ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 3 లక్షల 92 వేలు ఆమెకు చెల్లించవలసిందిగా అక్కడి న్యాయస్థానం తీర్పునిచ్చింది .
సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరికి అయినా అసభ్యకరమైన మెసేజ్ లు పెడితే దుబాయ్ చట్టం ప్రకారం నేరం. అందుకే కాబోయే భార్య అని సరదాగా ఇడియట్ అని అన్నందుకు ఇంత పెద్ద భారీ మూల్యం చెల్లించాడు ఆ వ్యక్తి. ఈ వార్త కాస్త బయటకిరావడంతో, సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిని, వివిధ దేశాల్లో ప్రధాన వార్తగా పతాకశీర్షికలకు ఎక్కించేంది. అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష అవసరమా అని చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలా జరగటం దుబాయిలో ఇది మొదటి సారి మాత్రం కాదు, ఇదే సంవత్సరం జనవరి లో దుబాయ్ లో నివసించే బ్రిటిష్ సిటిజన్ ఒకరు తన కార్ డీలర్ ను తిడుతూ ఇలాగే సందేశం పంపాడట. ఆ కారు డీలర్ బ్రిటిష్ వ్యక్తి పంపిన అసభ్యకర మెసేజ్ ను పోలీసులకి చూపించి, అతనిపై కేసు పెట్టి జైలు కి పంపాడట. దుబాయ్ చట్టాలు మన దేశం లో లాగా ఎవ్వరికి చుట్టాలు కాదు అనే విషయం మరో సారి స్పష్టం అయ్యింది.