ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ పదవికి చందాకొచ్చర్ రాజీనామా!వీడియో కాన్ సంస్థకు రూ. 3250 కోట్ల రుణ వ్యవహారంలో ప్రైవేట్ రంగంలో అతి పెద్దది ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈఓ గా ఉన్న చందాకొచ్చర్ సహాయం చేసినట్లు గా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనిపై ఐసీఐసీఐ బ్యాంకు స్వతంత్ర విచారణకు ఆదేశించింది.ప్రస్తుతం సిబిఐ, ఐటీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో చందా కొచ్చర్ తన పదవులకు రాజీనామా చేసారు. ఇందుకు ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు కూడా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం తాత్కాలిక సీఈఓ గా ఉన్న సందీప్ బక్షిని ఎండీ మరియు సీఈఓ గా నీయమిస్తున్నట్టు ఐసీఐసీఐ బోర్డు ప్రకటించింది. సందీప్ బక్షి 2023 వరకు పదవిలో కొనసాగనున్నారు.

చందాకొచ్చర్ రాజీనామా చేసిన తరువాత ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. షేర్ విలువ దాదాపుగా 4 శాతం పైన పెరగడంతో చందాకొచ్చార్ రాజీనామా ప్రభావం ఏమిలేదని తెలుస్తుంది.
Theme images by sbayram. Powered by Blogger.