బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య


ధోని బయోపిక్ లో హీరోగా నటించి దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు తెలిపారు.

సుశాంత్ మొదట టీవీ సీరియల్స్ లో నటించారు ఆ తరువాత 2013 లో వచ్చిన 'కైపోచి' సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. తన కెరీర్ లో 12 సినిమాల్లో నటించిన సుశాంత్ టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోని బయోపిక్ తో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు.

'శుద్ధ్ దేశి రొమాన్స్', 'పీకే',  'రాబ్తా', 'వెల్కమ్ న్యూయార్క్', 'చిచోరే', 'డ్రైవ్' వంటి చిత్రాలలో నటించాడు. అయన నటించిన 'దిల్ బేచారా' అనే చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. నటుడిగానే కాకుండా స్వచ్చంద సేవ కార్యక్రమాలకు కూడా సుశాంత్ భారీగా సాయం చేసేవారు. 2018 లో నాగాలాండ్ లో వరదలు వచ్చినపుడు 1.25 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. కేరళ వరదల్లో కూడా కోటి రూపాయలు విరాళంగా ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 
Powered by Blogger.