బాబు గోగినేని కి అదిరిపోయే షాక్!
బాబు గోగినేని గారు బాగా చదువుకున్న వ్యక్తి, గొప్ప మేధావి గా సమాజంలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు.
కానీ, ఆ పేరు అలానే పది కాలాల పాటు నిలబడాలంటే కొన్ని విషయాలను వదిలేస్తేనే మంచిది. బిగ్ బాస్ అనేది ఒక గేమ్ షో మాత్రమే, దాని గురించి ఎక్కువగా మాట్లాడటం వల్ల సమయం వృధా, నా లాంటి వాడు అసలు తెలుగు బిగ్ బాస్ కు రావడం తెలుగు బిగ్ బాస్ చేసుకున్న పుణ్యం అన్నట్లు మాట్లాడుతారు బాబు గోగినేని. కానీ, బిగ్ బాస్ అయిపోయిన తరువాత కూడా ఇప్పటికీ న్యూస్ చానెల్స్ లో కౌశల్ ఫై విమర్శలు చేస్తూనే ఉన్నారు బాబు గోగినేని.
ఇది నా స్థాయికి తగ్గ షో కానే కాదు అన్న బాబు గోగినేని గారు, ఆయన స్థాయికి తగ్గ పనులు చేస్తే బాగుంటుందని, ఇప్పటికైనా కౌశల్ ని విమర్శించడం మానేస్తే మంచిదని కౌశల్ అభిమానులు బాబు గోగినేని ని ఉద్దేశించి పోస్ట్లు పెడుతున్నారు. ఇక బిగ్ బాస్ ఫినాలే లో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను, బాబు గోగినేని బిగ్ బాస్ హౌస్ లో చెప్పిన మాటలకు అనుసంధానిస్తూ ఆసక్తికరమైన విశ్లేషణ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అది మీ కోసం.
నా ముందు కౌశల్ క్రేజ్ ఎందుకు పని రాదు అనే అర్థం వచ్చేలా మాట్లాడుతూ, కౌశల్ కంటే నాకే అభిమానులు ఎక్కువ.
కౌశల్ ని కచ్చితంగా బిగ్ బాస్ హౌస్ నుండీ బయటకు పంపుతా. గీత మాధురిని కూడా కచ్చితంగా బయటకు పంపుతా.
ఒకవేళ నేనే ముందు ఎలిమినేట్ అయితే వారిని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నిస్తా అంటూ బాబు గోగినేని బిగ్ బాస్ కెమెరాల సాక్షిగా చెప్పారు. అక్కడ సీన్ కట్ చేస్తే, బాబు గోగినేని గారు ఏ ఇద్దరినైతే బిగ్ బాస్ హౌస్ నుండి పంపించాలి అని అనుకున్నారో, ఆ ఇద్దరే బిగ్ బాస్ విన్నర్ గా, రన్నర్ అప్ గా నిలిచారు. ఎన్నో విషయాల గురించి ఉపన్యాసాలు ఇఛ్చి, ఒక గొప్ప మానవతా వాదిగా తనకు తాను చెప్పుకునే బాబు గోగినేని గారు ఇతరులను తక్కువ చేసి చూడకూడదు అనే చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయారు. జీవితం లో ఎవరిని తక్కువ చేసి కూడదు. ఎవరు ఏ క్షణం ఎలా ఎదుగుతారో చెప్పలేం. ఈ విషయాన్ని మీరు కూడా గ్రహించి పాటిస్తే బాగుంటుందని బాబు గోగినేని ని ఉద్దేశించి ప్రేక్షకులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు పెడుతున్నారు.