బిగ్ బాస్ హౌస్ లో "మన్మధుడి" సందడి
బిగ్ బాస్ షో వీకెండ్ కి వచ్చేసింది. మరో వారం రోజుల్లో షో ముగుస్తుండటంతో ఈ వారం నాని యాంకరింగ్ మీద ఉన్న విమర్శలకు ఈ రోజు నాని ఎలా వ్యవహరిస్తాడో అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు.
శనివారం అంతా కంటెస్టెంట్‌లను కాస్త వాయించి కౌశల్ ఆర్మీని కాస్త శాంత పరచాలి అని ప్రయత్నించాడు నాని. అయితే ఈరోజు (ఆదివారం) షోలో 'కింగ్' నాగార్జున సందడి చేయబోతున్నారు. ‘దేవదాస్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్‌బాస్ షోకి వచ్చిన నాగ్.. దేవగా ప్రేక్షకులను అలరించారు. దేవదాస్ మూవీలో దేవగా నాగ్, దాస్‌గా నాని నటించారు. షోకి వచ్చిన దేవ.. ‘మీ అందరిలో ఎవరో మా దాస్‌ని ఇబ్బంది పెడుతున్నారట. ఇందులో(గన్) కరెక్ట్‌గా ఆరు(బుల్లెట్స్) ఉన్నాయి’’ అంటూ సందడి సందడి చేస్తున్న ప్రోమోను సదరు ఛానల్ విడుదల చేసింది.
ఈ ప్రోమో లో కౌశల్, నాగార్జున మధ్య చాలా సరదా సన్నివేశాలు జరిగాయనే విషయం ప్రోమో చూస్తుంటేనే అర్ధమవుతుంది. దేవదాస్ సినిమాలో హీరోయిన్స్ గా నటించిన రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్ కూడా ఈ షో లో సందడి చేయబోతున్నారు. ఈ నెల 27 న దేవదాస్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.