తోలి టెస్టులోనే సెంచరీ చేసి రికార్డులు సృష్టించిన పృథ్వీ షా!


రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో జరుగుతున్నమొదటి టెస్టులో భారత ఓపెనర్ పృథ్వీ షా శతకంతో చెలరేగిపోయాడు . తన అరంగేట్ర మ్యాచ్ లోనే శతకం సాదించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కె.ల్ రాహుల్ తో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగిన పృథ్వీ షా మొదటినుండి దూకుడుగా ఆడుతూ పరుగులు సాధించాడు. మూడో ఓవర్లోనే రాహుల్ ఔటైనా పుజారాతో కలిసి 206 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పుజారా 86 పరుగుల వద్ద ఔటయ్యి శతకాన్ని చేజార్చుకోగా, పృథ్వీ షా మాత్రం 154 బంతుల్లో 134 పరుగులు చేసాడు.

అరంగేట్ర మ్యాచ్ లో సెంచరీ చేసిన 15 వ భారత ఆటగాడిగా రికార్డు సాధించాడు. చిన్న వయసులోనే సెంచరీ సాధించిన ఆటగాల్లో బాంగ్లాదేశ్ ఆటగాడు మొహమ్మద్ అష్రాఫుల్ 17 ఏళ్ళ 61 రోజుల్లో సెంచరీతో మొదటి స్థానంలో ఉండగా, సచిన్ తెందుల్కర్ 17 ఏళ్ళ 107 రోజుల్లో సెంచరీతో రెండో స్థానంలో , షా 18 ఏళ్ళ 329 రోజుల్లో సెంచరీ సాధించి మూడో స్థానంలో నిలిచాడు.

రంజీ,దులీప్ ట్రోపీలతో పాటు టెస్టుల్లోనూ అరంగేట్ర మ్యాచుల్లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు పృథ్వీ షా, సచిన్ టెండూల్కర్ రంజీ,దులీప్ ట్రోపీల్లో అరంగేట్రంలో సెంచరీ సాధించినా టెస్టుల్లో సెంచరీ చేయడానికి 13 మ్యాచ్ ల వరకు వేచి ఉండాల్సి వచ్చింది. సెలెబ్రిటీలు, ఫ్యాన్స్ సోషల్ మీడియా లో పృథ్వీ షా మీద అభినందనల వర్షం కురిపిస్తున్నారు. 
Powered by Blogger.