విజయ్ హజారే ట్రోపీలో అదరగొడుతున్న దేవదత్ పడిక్కల్

 ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్  తన సత్తా చాటుతున్నాడు.  గత ఏడాది జరిగిన ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున అద్భుత ప్రదర్శన చేసిన పడిక్కల్...ఈ ఏడాది జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ లో కూడా  దుమ్ము లేపాడు.

ఆడిన 6 మ్యాచ్లలో 4 సెంచరీలు రెండు అర్థ సెంచరీలు నమోదు చేశాడు.  లీగ్ దశలో జరిగిన మ్యాచులలో ఒడిశా పై 152 పరుగులు, కేరళ పై 126 పరుగులు,  రైల్వే జట్టుపై 145 పరుగులతో అజేయంగా నిలిచాడు.  ఇక కేరళతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచులో పడిక్కల్ రెండో సెంచరీని నమోదు చేశాడు.  ఈ మ్యాచ్లో పడిక్కల్ 101 పరుగులు చేశాడు.  మొత్తంగా ఈ టోర్నమెంట్లో ఇంతవరకూ 168 సగటుతో 673 పరుగులు సాధించాడు.

 దేవదత్ పడిక్కల్ గత ఏడాది ఆరోన్ ఫించ్ తో కలిసి ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఓపెనింగ్ చేశాడు.  ఆ సీజన్ మొత్తంగా పడిక్కల్ 15 మ్యాచ్లలో 473 పరుగులు చేశాడు. టోర్నమెంట్లో 5 అర్థ సెంచరీలు నమోదుచేసిన పడిక్కల్ 74 పరుగుల అత్యధిక స్కోరు ను కూడా నమోదు చేశాడు.  ఐపీఎల్ కు మరెన్నో రోజులు లేవు కాబట్టి పడిక్కల్ ఇదే ఫామ్ ను కొనసాగిస్తే  త్వరలో జరగబోయే ఐపీఎల్ సీజన్లో... RCB తరపున అదరగొట్టడం ఖాయమని అభిమానులు పేర్కొంటున్నారు..

No comments

Powered by Blogger.