కష్టాల్లో కడలిలో ఉన్నప్పుడు చుక్కాని లా ఉండి నీకు దారి చూపిన వ్యక్తి, తన వల్లే ఈ రోజు నువ్వు ఈ స్థాయిల్లో ఉన్నావని నీ మాటల ద్వారా తెలుసుకొని, నీ గెలుపు ని తన గెలుపుగా భావించి, ఆనందంతో నిన్ను అభినందిస్తే వచ్చే ఆ కిక్ వర్ణనాతీతం. అలాంటి విషయమే మంగళవారం చోటు చేసుకునింది. సూపర్ స్టార్ మహేష్ బాబు వల్లే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని కౌశల్ చెప్పడం, ఆ తరువాత కౌశల్ గెలుపుని మహేష్ బాబు అభినందిస్తూ ట్వీట్ చేయడం సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. కౌశల్ గురించి మహేష్ బాబు ట్వీట్ చేయడంతో, మంగళవారం ట్విట్టర్ దద్దరిల్లింది. ఈ సందర్భంగా ట్విట్టర్ లో చోటు చేసుకున్న ఓ రెండు అద్భుతాలు మీ కోసం.
మొదటిది, మహేష్ బాబు పెట్టిన ట్వీట్ కి కొంత మంది సమాధానమిస్తూ, మహేష్ బాబు గారు నేను పలానా హీరో అభిమానిని, నేను ఎప్పుడు కానీ మీ ట్వీట్ ని రీట్వీట్ చేయలేదు, సమాధానం కూడా ఇవ్వలేదు, కౌశల్ గురించి మీరే స్వయంగా ట్వీట్ చేయడంతో మీ గొప్పతనం అర్థం అయ్యింది. లవ్ యూ మహేష్ బాబు గారు అంటూ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా ఒక్కరేమిటి వివిధ హీరో ల అభిమానులు మహేష్ బాబు కి ఎంతో ప్రేమతో ట్వీట్లు పెట్టడం కన్నుల పండుగగా ఉంది. ఇది చూసిన చాలా మంది అభిమానులు, అభిమానుల మధ్య ఇలాంటి స్నేహపూర్వక వాతావరణమే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు.
రెండవది, చాలా మంది కౌశల్ అభిమానులు పెయిడ్ అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ని కూడా కౌశల్ కొన్నాడా.కౌశల్ అభిమానులు పెయిడ్ అనే వారికి ఒక సారి మహేష్ బాబు పెట్టిన ట్వీట్ చూపియండి. సూపర్ స్టార్ పెట్టిన ట్వీట్ చాలా కొద్దీ గంటల్లోనే యాభైవేల లైకులు, పది వేల రీట్వీట్లు, రెండువేల కు పైగా కామెంట్స్ వచ్చాయి అంటే కౌశల్ కి ఎంత క్రేజ్ ఉందొ అర్థం చేసుకోవాలి. అభిమానం కొనుక్కుంటే రాదు, క్యారెక్టర్ నచ్చితే వస్తుంది. అభిమానం నిజంగా అభిమానమనేది అంగట్లో కొనుక్కునే సరుకు లాంటిదే అయితే, ఈ పాటికి ప్రతి కోటీశ్వరుడి కొడుకు ఓ స్టార్ అయిపోయేవాడు అంటున్నారు కౌశల్ అభిమానులు.