"కౌశల్ ని బయటికి గెంటేయండి" అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్

Kaushal
Kathi Mahesh
బిగ్ బాస్ షో చివరికి చేరుకుంది. 16 మంది కంటెస్టెంట్స్ లో అయిదుగురు ఫైనల్ కు చేరుకున్నారు.  కౌశల్, దీప్తి, గీత మాధురి, తనీష్ మరియు సామ్రాట్ ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ఫైనల్ బరిలో నిలిచారు. ఇంకా ఎవరు బిగ్ బాస్ టైటిల్ గెలుస్తారో అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంది. ఎవరికైతే ఎక్కువ ఓట్లు పడతాయో వారినే విజేతగా ప్రకటిస్తారు. సోమవారం రాత్రి 10:25 నిమిషాల నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి.

ఇప్పటికే కౌశల్ ఆర్మీ కౌశల్ ని గెలిపించడానికి చాలా ప్రయత్నిస్తుంది. హైదరాబాద్, విజయవాడ మరియు బెంగుళూరు లో 2కే వాక్ నిర్వహిస్తూ, కౌశల్ కి మరింత మద్దతుని కూడగడుతున్నారు. డైరెక్టర్ మారుతి, ఫిష్ వెంకట్, మాధవి లత వంటి చాలా మంది సినీ ప్రముఖులు కూడా కౌశల్ కి తమ మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు.  ఇలాంటి సమయంలో బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ కంటెస్టెంట్ కత్తి మహేష్ కౌశల్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.

 బిగ్ బాస్ హౌస్ లో ఇటీవల జరిగిన గొడవతో 'కౌశల్ అంతా కోల్పోయాడు. అతన్ని హౌస్ నుండి బయటికి గెంటేయండి' అంటూ ట్వీట్ పెట్టారు. శనివారం నాని కౌశల్ ని ప్రశ్నించిన సమయంలో ' చాలా పేలవమైన, విసుగుపుట్టించే సమాధానం చెప్పాడు కౌశల్. బిగ్ బాస్ చరిత్రలోనే చాలా చిరాకు తెప్పించే వ్యక్తి' అని ట్వీట్ చేసారు.  మరో ట్వీట్ లో కౌశల్ బిగ్ బాస్ 2 లో విసుగు తెప్పించే వ్యక్తి. ఒకవేళ అతను బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే మనమెంత మూర్ఖులమనేది రుజువు అవుతుంది అని, అంతే కాదు తాను దీప్తి నల్లమోతు తరుపున క్యాంపెయిన్ చేస్తానని ట్వీట్స్ చేసారు.


Powered by Blogger.