ప్రపంచ నెంబర్ 1 కంపెనీ "ఆపిల్"

  • గూగుల్ ని దాటి నెంబర్ 1 స్థానం సొంతం చేసుకున్న ఆపిల్
  • 6వ స్థానం నుండి 9 వ స్థానానికి పడిపోయిన పేస్ బుక్
ఇంటర్ బ్రాండ్: ప్రపంచంలోని టాప్ 100 బ్రాండ్స్ జాబితాను ఇంటర్ బ్రాండ్ అనే సంస్థ ప్రకటించింది. గత ఏడాది నెంబర్.1 గా ఉన్న గూగుల్ స్థానాన్ని ఆపిల్ సొంతం చేసుకుని ప్రపంచపు నెంబర్.1 గా నిలిచింది. 2017 తో పోలిస్తే ఆపిల్ వృద్ధి రేటు 16 శాతం (214 బిలియన్స్) పెరిగింది. కేంబ్రిడ్జి అనలిటికా, యూజర్ల డేటా లీక్ వంటి కారణాల చేత గత ఏడాది 6వ స్థానంలో ఉన్న పేస్ బుక్ ఈ ఏడాది 9వ స్థానానికి పడిపోయింది. టాప్ 10 లో ఉన్న బ్రాండ్స్ కంటే అత్యధికంగా 56 శాతం వృద్ధి రేటుని సాధించిన అమెజాన్ మూడో స్థానంలో నిలిచింది. మైక్రోసాఫ్ట్ నాలుగో స్థానంలో నిలిచింది.

ఇంటర్ బ్రాండ్ ప్రకటించిన టాప్ 10 కంపెనీలు:
  1. ఆపిల్ - $214 బిలియన్స్ (16%)
  2. గూగుల్ - $155 బిలియన్స్ (10%)
  3. అమెజాన్- $100 బిలియన్స్(56%)
  4. మైక్రోసాఫ్ట్- $92 బిలియన్స్(16%)
  5. కోకో-కోలా - $66 బిలియన్స్(-5%)
  6. శాంసంగ్ - $59 బిలియన్స్ (6%)
  7. టొయోటా - $53 బిలియన్స్ (6%)
  8. మెర్సిడెస్ బెంజ్ - $48 బిలియన్స్ (2%)
  9. పేస్ బుక్ - $45 బిలియన్స్ (6%) 
  10. మెక్ డొనాల్డ్స్ - $43 బిలియన్స్ (5%)
Powered by Blogger.